పథకం అమలు
మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయి. ఈ పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. అయితే, కొన్ని రాష్ట్రాలు కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల కంటే భిన్నమైన మార్గదర్శకాలను జారీ చేశాయి.
ఈ పథకాన్ని పర్యవేక్షించడానికి ఏర్పాటైన జాతీయ సారథ్య, పర్యవేక్షణ కమిటీ.. దీని ప్రభావాన్ని లెక్కించడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విధానపరమైన సలహాలు అందజేస్తుంది. ఈ కమిటీ వార్షిక కార్యాచరణ ప్రణాళిక సమర్పించిన అనంతరం పథకం అనుమతి బోర్డు కేంద్ర సహాయాన్ని సబ్సిడీల రూపంలో విడుదల చేస్తుంది.
ఈ పథకాన్ని పర్యవేక్షించడం కోసం రాష్ట్ర స్థాయిలో కూడా సారథ్య, పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటయ్యాయి. ఈ బాధ్యతలు తీసుకోవడానికి నోడల్ విభాగానికి అధికారం ఇచ్చారు. పథకం అమలు విభాగాలన్నీ నోడల్ విభాగం ద్వారా నిర్వహింపబడతాయి. పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రతి జిల్లా, బ్లాక్ స్థాయిలో ఒక్కో అధికారిని నియమించారు.
ప్రాథమిక విద్య బాధ్యతలు చూస్తున్న పంచాయతీలు/పట్టణ స్థానిక సంస్థలు ఈ పథకానికి ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్నాయి.
నిధుల ప్రవాహం
భారత ప్రభుత్వం తరఫున కేంద్ర సాయం కింద రాష్ట్రాలకు నిధులు మంజూరు చేయడానికి మరియు ఆహార ధాన్యాలను సరఫరా చేయడానికి మానవ వనరుల అభివృద్ధి శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది.
ఆహార ధాన్యాల ప్రవాహం
చిత్రాలకు మూలం: ప్రణాళికా సంఘం, భారత ప్రభుత్వం
The Akshaya Patra Foundation © 2015 Website Designed & Maintenance By Creative Yogi
