ఆడిట్ మరియు సిస్టమ్స్
సుపరిపాలనకు అంతర్గత నియంత్రణ మూలమని మేం విశ్వసిస్తాం. అందుకే పారదర్శకతలో అత్యుత్తమ ప్రమాణాలను పాటించేలా చూస్తున్నాం మరియు కఠిన చర్యలను అవలంబిస్తున్నాం.
అంతర్గత నియంత్రణ వ్యవస్థలు సమర్థంగా పని చేయడానికి వీలుగా, ప్రఖ్యాత చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థలను బ్రాంచి ఆడిటర్లుగా కంపెనీ నియమించింది. తమ తమ బ్రాంచిలకు సంబంధించిన ఆడిట్ నివేదికలను నిర్ణీత కాల వ్యవధిలో ఎప్పటికప్పుడు ఆయా బ్రాంచి ఆడిటర్లు యాజమాన్యానికి సమర్పిస్తారు. ఆయా నివేదికలను కంపెనీలోని ఆడిట్ విభాగం ద్వారా ఆడిట్ కమిటీ సమీక్షిస్తుంది.
ఆడిట్ కమిటీ అనేది ధర్మకర్తల మండలిలో ఉప సంఘం. సమర్థ అంతర్గత నియంత్రణ వాతావరణాన్ని సృష్టించడమే దీని ధ్యేయం.
ఆడిట్ కమిటీలో కింద పేర్కొన్న ధర్మకర్తలు ఉంటారు.
వి.బాలకృష్ణన్ – చైర్మన్
రామదాస్ కామత్ - సభ్యుడు
రాజ్ కొండూరు - సభ్యుడు
The Akshaya Patra Foundation © 2015 Website Designed & Maintenance By Creative Yogi
